ap-10th-class-ssc-exams-2025-results

 ap-10th-class-ssc-exams-2025-results

ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షలు 2025 (AP SSC Exams 2025) మార్చి 17 నుండి మార్చి 31, 2025 వరకు నిర్వహించబడ్డాయి. ఇప్పుడు విద్యార్థులు, పేరెంట్స్ అందరూ AP SSC ఫలితాలు 2025 (AP 10th Results 2025) కోసం ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (BSEAP) ఈ ఫలితాలను ఏప్రిల్ 23, 2025న ప్రకటించనుంది.
ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల*
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ రామరాజు.వి. ఐ.ఎ.ఎస్.,
అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మనమిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్

మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నాం.
అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.inhttps://apopenschool.ap.gov.in/  వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 
వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు. 

AP SSC ఫలితాలు 2025 – ముఖ్య వివరాలు

  • ఫలితాలు విడుదల తేదీ: ఏప్రిల్ 23, 2025
  • మొత్తం మార్కులు: 600 (6 సబ్జెక్టులు × 100 మార్కులు)
  • పాస్ శాతం: ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు అవసరం
  • ఫలితాలు చూసే వెబ్సైట్: bse.ap.gov.in

AP SSC ఫలితాలు 2025 ఎలా చెక్ చేయాలి?

  1. BSEAP అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in లో లాగిన్ అవ్వండి.
  2. “AP SSC Results 2025” లింక్పై క్లిక్ చేయండి.
  3. రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి.
  4. ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి, డౌన్లోడ్ చేసుకోండి.

AP SSC మార్క్స్ మెమో 2025

  • గ్రేడింగ్ సిస్టమ్: A1 (90+ మార్కులు) నుండి E (35% కంటే తక్కువ) వరకు ఉంటుంది.
  • CGPA: 10-పాయింట్ స్కేల్లో (10 అత్యధికం, 2 కనిష్టం) ఇవ్వబడుతుంది.

AP SSC ఫలితాలు 2025 – అన్ని లింక్స్