ap-dsc-2025-teachers-induction-training-details

 ap-dsc-2025-teachers-induction-training-details

కన్వీనర్, DSC-2025 వారు జారీ చేసిన ఒక అధికారిక ఆదేశం.

ముఖ్యాంశాలు:

Mega DSC-2025లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల కోసం Induction Training Programme (ప్రాథమిక శిక్షణ కార్యక్రమం) నిర్వహించబడుతుంది.

ఈ శిక్షణ 03-10-2025 నుండి 10-10-2025 వరకు జరుగుతుంది.

శిక్షణలో ప్రధాన అంశాలు:

1. ఉపాధ్యాయులు విద్యాబోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం.

2. విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం.

3. RTE (Right to Education Act), బాలల హక్కుల చట్టం వంటి ముఖ్య విషయాలు తెలియజేయడం.

4. మొదటి తరం చదువుకుంటున్న పిల్లలకు ఉపాధ్యాయుల బాధ్యతలను వివరించడం.

5. AP SCF, NCF-2005, NEP-2020, NCFPE-2022, NEPSE-2023 వంటి విద్యా విధానాలపై అవగాహన కల్పించడం.

6. పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలు నేర్పించడం.

7. ఉపాధ్యాయులు జీవితాంతం నేర్చుకునేలా ప్రేరేపించడం.

8. డిజిటల్ టూల్స్ & టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలపై పరిచయం కల్పించడం.

9. వృత్తి నైపుణ్యం, నియమాలు పాటించడం, విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం.

ముఖ్య గమనిక:

కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరుకావడం తప్పనిసరి.

శిక్షణ పూర్తయ్యాకే పోస్టింగ్ ఆర్డర్లు (పనిచేసే పాఠశాల నియామక ఉత్తర్వులు) ఇవ్వబడతాయి.

కాబట్టి, ఈ ఆదేశం ప్రకారం ఎంపికైన ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణకు హాజరుకావాలి, ఆ తర్వాతే ఆయన/ఆమె పనిలో చేరే అవకాశం ఉంటుంది.

DSC 2025 Teachers కు ఇంత వరకు ఏదైనా Nationalised Bank లో Bank Account లేక పోతే Aadhar, PAN లతో Bank Account Open చేసుకోవాలి.

Job లో చేరిన తర్వాత CFMS id కొరకు DDO లకు PAN Zerox, Bank Account Details లతో Bank Account Pass book First page Copy, Photo ఇవ్వవలెను.

CFMS ID వచ్చిన తర్వాత Nidhi Portal లో PRAN No, APGLI Nos కోసం Online లో Submit చేయవలెను.

Job లో చేరే రోజు  Asst Civil Surgenకు తగ్గకుండా Physical fitness తో 4 కాపీల Attestation Form s‌ HM/ MEO /Principal కు ఇవ్వవలెను.

Job కు అవసరమైన Educational Qualifications వరకే Attestation Forms లో Fill చేసుకోవాలి.

Attestation Form లో Mobile no  ఇవ్వాలి.